Advertisement

అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై మొగులయ్య తెలిపారు. మిర్చి కంపౌండ్‌ ప్రాంతానికి చెందిన యువతి(24) రామడుగుకు చెందిన ప్రమోద్‌గౌడ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో భర్త వేధింపులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement