అక్షరటుడే, వెబ్‌డెస్క్: earthquake | మయన్మార్, థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో Bangkok శుక్రవారం భారీ భూకంపం earthquake సంభవించింది. ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవ్వడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప earthquake తీవ్రత మయన్మార్‌లో 7.7, రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉందని సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. దీంతో భారీ స్థాయిలో నష్టం జరిగింది. పలు భారీ భవనాలు నేల కూలాయి. మరోవైపు మయన్మార్‌లోనూ భూకంపం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం దాటికి మయన్మార్ మాండలేలో ఇరావాడి నదిపై ఉన్న ఐకానిక్ వంతెన కూలిపోయింది. మరోవైపు బ్యాంకాక్‌లోని భవనాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
earthquake | భారత్‌లోనూ భూప్రకంపనలు
మయన్మార్‌లో సంభవించిన భూకంపతో భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నా, మేఘాలయలో భూమి కంపించింది. బంగ్లాదేశ్, చైనాల కూడా భూమి కంపించినట్లు సమాచారం.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవ్వడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉందని సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది#Bangkok #Thailand pic.twitter.com/mTlb6esNt5
— Akshara Today (@aksharatoday) March 28, 2025