అక్షరటుడే, వెబ్డెస్క్: KIA | శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai district) పెనుకొండ మండలంలో ఉన్న కియా కార్ల పరిశ్రమ(Kia car factory)లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 900 ఇంజిన్లను(Engines) దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక్కడ కియా పరిశ్రమలో కార్లు ఉత్పత్తి చేస్తారు. అయితే విడిభాగాలు వివిధ భాగాల నుంచి వస్తుంటాయి.
ఈ క్రమంలో 900 కార్ల ఇంజిన్లు(Engines) మాయమైనట్లు యాజమాన్యం(Mangement) గుర్తించింది. ఈ ఘటనపై గత నెలలోనే కంపెనీ పోలీసులకు(Police) ఫిర్యాదు చేసింది. దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఇంజిన్లు(Engines) పరిశ్రమకు వచ్చే మార్గంలో చోరీ అయ్యాయా..? లేక లోనికి వచ్చాక ఎత్తుకెళ్లారా..? అనే కోణంలో ఏపీ పోలీసులు ap police దర్యాప్తు చేస్తున్నారు.