అక్షరటుడే, బాన్సువాడ:MLA POCHARAM | రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి mla pocharam srinivas reddy బోనమెత్తారు. బాన్సువాడ పట్టణంలోని నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎజాజ్, నార్ల సురేష్, అంజిరెడ్డి, గంగాధర్, నర్సుగొండ తదితరులు పాల్గొన్నారు.