అక్షరటుడే, బాన్సువాడ: mla pocharam | ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో సంతోషం నింపాలని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ యేడు ప్రజలు అద్భుతమైన విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఆదివారం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన ఉగాది వేడుక, పంచాంగ శ్రవణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రూ.50 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో శంభురెడ్డి తదితరులు పాల్గొన్నారు.