McDonald | హైదరాబాద్​కు మెక్ డొనాల్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయం

McDonald | హైదరాబాద్​కు మెక్ డొనాల్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయం
McDonald | హైదరాబాద్​కు మెక్ డొనాల్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయం
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: McDonald : తెలంగాణ ప్రభుత్వంతో అమెరికా మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ కీలక ఒప్పందం చేసుకుంది. మెక్ డొనాల్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రకటించింది. 2 వేల మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్​లో బుధవారం ఉదయం మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్సీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా తమ గ్లోబల్ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి మెక్ డొనాల్డ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్నారు. మెక్డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవో తో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కె ఆండర్సన్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్ ఈ సమావేశంలో ఉన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Jubilee Hills | పెళ్లి పేరుతో వల వేసి.. 24 మందిని మోసం చేశాడు

మెక్​ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్​లో ఏర్పాటుకు ముందుకు రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వారికి ముఖ్యమంత్రి వివరించారు.

సంస్థకు అవసరమైన శిక్షణ, నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్​ సూచించారు. వర్సిటీని స్కిల్ జోన్ గా ఉపయోగించుకోవాలని, ఇందులో శిక్షణ అందుకున్న వారికి గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

Advertisement