అక్షరటుడే, ఇందూరు: మధ్యాహ్న భోజన పథకం మెనూ చార్జీలను పెంచాలని ఎండీఎం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం యూనియన్ జిల్లా మహాసభలను నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 54 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస గుర్తింపు ఇవ్వకుండా, విద్యార్థులకు సరిపడా కార్మికుల సంఖ్యను పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, హనుమాన్లు, నాగలక్ష్మి, రూప, గంగామణి, రమ్య, సవిత, కవిత పాల్గొన్నారు.