అక్షరటుడే, కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో మీసేవ నిర్వాహకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా(kamareddy district) రామారెడ్డి మండల కేంద్రం శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన దినేష్ కామారెడ్డి నుంచి రామారెడ్డికి బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామారెడ్డి నుంచి వస్తున్న ఆటో, బైక్ రెండు ఢీకొనడంతో దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆటో రోడ్డు పక్కన పడిపోవడంతో డ్రైవరు లింబాద్రి అందులోనే ఇరుక్కుపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని బయటకు తీశారు. లింబాద్రితో పాటు ఆటోలోనే ఉన్న అతని భార్య లక్ష్మీకి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరిని చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.