Elephant Hair Style : ఈ ఏనుగు హెయిర్ స్టైల్‌కి ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే… భ‌లే వెరైటీగా ఉందే..!

Elephant Hair Style : ఈ ఏనుగు హెయిర్ స్టైల్‌కి ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే... భ‌లే వెరైటీగా ఉందే..!
Elephant Hair Style : ఈ ఏనుగు హెయిర్ స్టైల్‌కి ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే... భ‌లే వెరైటీగా ఉందే..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Elephant Hair Style : ఈ రోజుల్లో యూత్ హెయిర్ స్టైల్స్ ఆక‌ట్టుకునేలా ఉంటున్నాయి. స‌రికొత్త హెయిర్ స్టైల్స్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు. అయితే మ‌నుషులేనా, మేము కూడా డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తామ‌ని ఓ ఏనుగు స‌రికొత్త హెయిర్ స్టైల్‌తో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇలా ఏనుగుని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో ఏనుగు లుక్ అదిరిపోయింద‌ని కామెంట్ చేస్తున్నారు. తమిళనాడులో సెంగమలం అనే ఓ ఏనుగు ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్‌గా మారింది. దాని స్టైలిష్ హెయిర్ క‌ట్ గురించే అంద‌రు మాట్లాడుకుంటున్నారు. ఇది మన్నారుగుడిలోని రాజగోపాలస్వామి ఆల‌యంలో ఉంటుంది.

Elephant Hair Style : హెయిర్ స్టైల్ అదుర్స్..

2003లో కేరళ నుంచి ఈ ఏనుగుని తీసుకొని రాగా, అప్పటినుంచి భక్తులు, టూరిస్టులు అందరికీ సెంగమలం ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు సరికొత్త‌ హెయిర్ స్టైల్‌తో ఆన్‌లైన్‌లో సెన్సేష‌న్ సృష్టిస్తుంది. ఇండియా కల్చరల్ హబ్ అనే ఇన్‌స్టా పేజీలో సెంగమలం వీడియో పెట్టారో లేదో అది ఇట్టే క్ష‌ణాల‌లో వైరల్ అయిపోయింది. అసలు ఈ హెయిర్ స్టైల్ వెనుక ఉన్నది ఎవరంటే.సెంగమలం మహావుత్ ఎస్.రాజగోపాల్. ఆయనే స్వయంగా ఎంతో ప్రేమగా తన జుట్టుని కత్తిరించి బొబ్ కట్ స్టైల్ లో రెడీ చేశారు. ఈ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి రోజుకి మూడుసార్లు జుట్టుకి షాంపూ పెట్టి మరీ త‌ల‌స్నానం చేయిస్తార‌ని చెప్పారు.

స‌మ్మ‌ర్‌లో మూడు సార్లు స్నానం చేపించే అత‌ను మిగతా సీజన్స్ లో అయితే రోజుకి ఒక్కసారైనా స్నానం చేయించాలి అంటున్నారు.అంతేకాదు, ఈ ఎండాకాలంలో సెంగమలం చల్లగా ఉండటం కోసం ఏకంగా 45 వేలు పెట్టి స్పెషల్ షవర్ కూడా పెట్టించారు. ఇప్పుడు సెంగ‌మ‌లంకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. బొబ్ క‌ట్‌లా ఏనుగుకి భ‌లే త‌యారు చేశారుగా అని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. సెంగమలం వైరల్ అవ్వడం ఇదేం మొదటిసారి కాదు.2020లో కూడా ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి.ఇక ఏనుగు తల మీద ఉండే జుట్టు శరీరం వేడిని బయటికి పంపడానికి సహాయపడుతుంది.

Advertisement