Chiranjeevi – Venkatesh : చిరు నవ్వుల పండుగతో మెగాస్టార్ చిరంజీవి.. విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడంటూ..!

Chiranjeevi - Venkatesh : చిరు నవ్వుల పండగ తో మెగాస్టార్ చిరంజీవి.. విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడంటూ..!
Chiranjeevi - Venkatesh : చిరు నవ్వుల పండగ తో మెగాస్టార్ చిరంజీవి.. విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడంటూ..!

అక్షర టుడే, వెబ్ డెస్క్: Chiranjeevi – Venkatesh : మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్​లో ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సంక్రాంతికి వెంకటేశ్​తో (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ సినిమా చిరంజీవితో చేయబోతున్న ప్రాజెక్ట్ కూడా వచ్చే సంక్రాంతి టార్గెట్ పెట్టుకున్నారు. ఐతే చిరంజీవితో చేసే సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్​గా ఉండబోతుందని తెలుస్తుంది.

Advertisement
Advertisement

మెగాస్టార్ చిరంజీవిలో (Megastar Chiranjeevi) ఉన్న కామెడీ యాంగిల్​ని పర్ఫెక్ట్​గా వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు అనిల్ రావిపూడి. ఐతే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా ఇంపార్టెంట్ రోల్​లో నటిస్తాడని టాక్. మరి అందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. (Chiranjeevi) చిరంజీవి అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

Chiranjeevi – Venkatesh : టైటిల్​గా చిరు నవ్వుల పండుగ..

ఇక ఈ సినిమాకు టైటిల్​గా చిరు నవ్వుల పండుగ అని పెట్టబోతున్నారట. ఈ సినిమాలో కూడా భార్యా భర్తల కథ అని తెలుస్తుంది. చిరు నవ్వుల కథ సినిమాతో (Anil Ravipudi) అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్​గా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను రేపు పూజా కార్యక్రమాలు జరపబోతున్నాయని తెలుస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Silk Smitha : సిల్క్ స్మిత డేట్స్ కోసం చిరంజీవి ఎదురుచూపులు.. ఏ సినిమానో తెలుసా..?

చిరు నవ్వుల పండుగ సినిమా ఎలా ఉంటుంది.. సంక్రాంతికి మరో సూపర్ హిట్ సినిమాగా ఇది బ్లాక్ బస్టర్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అనిల్ కాంబో (Anil Ravipudi) అనగానే మెగా ఫ్యాన్స్​లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆల్రెడీ వరుస సూపర్ హిట్లు కొడుతున్నాడు కాబట్టి తప్పకుండా చిరంజీవి సినిమాతో కూడా మరో సూపర్ హిట్ షురూ అని ఫిక్స్ అవుతున్నారు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఉంటే సంథింగ్ స్పెషల్ అనేలా ఉంది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాకు భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది.

Advertisement