అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా మరో పురస్కారం అందుకున్నారు. యూఏఈలోని అబుదాబిలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్ – 2024 వేడుకల్లో ‘ఔట్‌ స్టాండింగ్ అచీవ్‌మెంట్‌ ఇండియన్‌ సినిమా’ అవార్డు తీసుకున్నారు. చిరంజీవికి ఈ అవార్డును బాలీవుడ్‌ దిగ్గజాలు షబానా ఆజ్మీ, జావెద్‌ అక్తర్‌లు అందజేశారు. కార్యక్రమానికి టాలీవుడ్‌ నటులు విక్టరీ వెంకటేశ్‌, నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. కాగా చిరంజీవికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవిని బాలకృష్ణ హగ్‌ చేసుకున్న వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.