Vishwambhara : చిరంజీవి విశ్వంభర ‘రామ రామ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..!

Vishwambhara : చిరంజీవి విశ్వంభర ‘రామ రామ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..!
Vishwambhara : చిరంజీవి విశ్వంభర ‘రామ రామ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..!

అక్షర టుడే, వెబ్ డెస్క్ Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Vasishta) వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. (Vishwambhara) యువీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి (Chiranjeevi) ఈ సినిమాను చాలా స్పెషల్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. బింబిసార తో సత్తా చాటిన వశిష్ట (Vasishta) రెండో సినిమానే చిరుతో అదిరిపోయే ఛాన్స్ అందుకున్నాడు. ఇక యువీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.

Advertisement

విశ్వంభర సినిమాకు ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ (M.M. Keeravani Music) అందిస్తున్నారు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రామ రామ రేపు రిలీజ్ చేయబోతున్నారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. శనివారం ఉదయం 11:12 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి అంచనాలు పెంచారు మేకర్స్.

Vishwambhara : చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో..

జై శ్రీరాం అంటూ చిరంజీవి (Chiranjeevi) వాయిస్​తో మొదలవుతున్న ఈ సాంగ్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. విశ్వంభర సినిమాలో త్రిషతో పాటుగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్​గా నటిస్తున్నారు. ఈ సినిమాను చిరంజీవి (Chiranjeevi) జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉంటుందని అంటున్నారు. అసలైతే ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నా ఈ మూవీ వాయిదా పడింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Vishwambhara : విశ్వంభర రామ రామ ఫుల్ సాంగ్.. స్విచ్ ఆన్ టు డివోషనల్ మోడ్ నెక్స్ట్ లెవెల్..!

సమ్మర్​కి అయినా తెస్తారని ఫ్యాన్స్ అనుకోగా ఈ ఇయర్ సెకండ్ హాఫ్​లోనే విశ్వంభర రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. విశ్వంభర అనౌన్స్​మెంట్​తోనే రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోగా సినిమా కూడా బాగా వస్తుందని తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి విశ్వంభర తో మెగాస్టార్ ఎలాంటి హంగామా చేస్తారన్నది చూడాలి. ఈ సినిమా విషయంలో చిరు కూడా సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాకు కీవారణి మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement