అక్షర టుడే జుక్కల్: పిట్లం మండల కేంద్రంలోని గౌడ సంఘ సభ్యులు ఆదివారం దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో రేణుకా మాత గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా సాయ గౌడ్, రవిగౌడ్, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా మొగుల గౌడ్, కోశాధికారిగా రామకృష్ణ గౌడ్, వెంకటేష్ గౌడ్, సలహాదారులుగా రామా గౌడ్ (రిటైర్డ్ టీచర్), రమణ గౌడ్, కాషా గౌడ్, వెంకటేష్ గౌడ్ , సభ్యులుగా రాఘవేందర్ గౌడ్, రామాగౌడ్ , లలిత, శివప్రసాద్, హనుమ గౌడ్, శంకర్ గౌడ్, శివప్రసాద్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.