అక్షరటుడే, బాన్సువాడ: రెడ్డి కులస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శుక్రవారం బాన్సువాడ సీఐ అశోక్​కు ఫిర్యాదు చేశారు. తన రాజకీయ లబ్ధి కోసం మల్లన్న రెడ్డి సామాజిక వర్గం గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని.. ఈ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు మాసాని అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాశం రాజిరెడ్డి, నరసింహరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్రాం రెడ్డి, రవీందర్ రెడ్డి, హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Banswada | కాంగ్రెస్ పార్టీలో​ కార్యకర్తలందరికీ సమప్రాధాన్యం : కాసుల బాలరాజ్​