అక్షరటుడే, జుక్కల్: జుక్కల్ మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట శనివారం మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యాలతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, నాయకులు షేక్ ఫిర్దోస్, నర్సింలు, చందర్, కిరణ్ కుమార్, గంగామణి, గోదావరి, రాంబాయ్, సునీత, లలిత, జగదేవి, విఠల్ తదితరులు పాల్గొన్నారు.