అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌లను నియమించాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలో కార్డియాలజిస్టులు, టెక్నీషియన్లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రి వెళ్తే సరైన వైద్యం అందడంలేదన్నారు. వెంటనే స్పందించి కార్డియాలజిస్ట్‌లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు ఇద్రిస్ ఖాన్, రియాజ్, అమర్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.