అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: బొందెం గడ్డ చెరువు బాధిత కుటుంబాలను సత్వరమే ఆదుకోవాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ డిమాండ్ చేశారు. బాధితుల సమస్య పరిష్కరించాలని ఎంపీ అసదుద్దీన్ ఇచ్చిన లెటర్ ను శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును కలిసి అందజేశారు. అనంతరం ఫయాజ్ మాట్లాడుతూ.. బాధితులకు ఎంఐఎం పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు వల్లే బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయని, నాలుగు నెలలైనా ఇప్పటి వరకు డబుల బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ఈ విషయం పార్టీ చీఫ్ అసద్ దృష్టికి తీసుకెళ్లగా.. సత్వరమే ఆయన మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చే వరకు బాధితుల తరఫున తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.