అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన అధికార పార్టీ కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి ఫిర్యాదు చేశారు. అక్షరటుడేలో ప్రచురితమైన కథనాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపి కార్పొరేటర్ కబ్జా నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. కాగా.. కబ్జా అంశంపై సమగ్ర విచారణ జరపాలని నిజామాబాద్ ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు.