అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వడ్ల కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. మంగళవారం నుంచి ప్రతి మండలంలోని తహసీల్దార్లకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఎన్నికల హామీల్లో వడ్లకు బోనస్‌ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు సన్నరకాల ధాన్యంకు మాత్రమే బోనస్‌ ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని పేర్కొన్నారు.