అక్షరటుడే, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ యాక్టింగ్ సీఎం అని ఆరోపించారు. రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తరని, కేటీఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తూ బీజేపీపై కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మాటలు జనం నమ్మరన్నారు. సీఎం మారుతారో లేదో తమకేలా తెలుస్తుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. అధికారంలో లేకపోయినా కేటీఆర్ ఇంకా అహంకార ధోరణితోనే మాట్లాడుతున్నారని విమర్శించారు.