రేపు కార్యకర్తలతో మంత్రి సురేఖ ముఖాముఖి

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గాంధీభవన్లో బుధవారం జరిగే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆమె కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతారు. కార్యకర్తలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు.