తెలంగాణ సంస్కతి, చరిత్రను చాటేలా బతుకమ్మ గార్డెన్‌: మంత్రి గంగుల

0

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా కరీంనగర్‌ శివారులోని మానేరు నదిలో రివర్‌ ఫ్రంట్‌ను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో మంగళవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

కరీంనగర్‌: ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా కరీంనగర్‌ శివారులోని మానేరు నదిలో రివర్‌ ఫ్రంట్‌ను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో మంగళవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాను అభివృద్ధి చేయడంతో పాటు అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న ఎంఆర్‌ఎఫ్ ‌(మానేరు రివర్‌ ఫ్రంట్‌) చరిత్రలో నిలువనుందని చెప్పారు.

మానేరు జలాశయం స్పిల్‌వే ఎదుట నిర్మించిన తీగల వంతెన వినియోగంలోకి రాగా, రివర్‌ ఫ్రంట్‌ పనులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఉజ్వల పార్కు నుంచి తీగల వంతెన వరకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. లోయర్‌ ప్రామినేటెడ్‌, అప్పర్‌ ప్రామినేటెడ్‌ పనులు, అనంతరం సివిల్‌ పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకర్షించేలా పెడస్టల్‌ బ్రిడ్జి, ఈకో మొబిలి కారిడార్‌, తెలంగాణ సంస్కృతి, పోరాటయోధుల చరిత్రను వివరించేలా బతుకమ్మ గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అంతకుముందు రివర్‌ ఫ్రంట్‌ వద్ద చేపట్టే నిర్మాణ పనుల గురించి ఐఎన్‌ఏ స్టూడియో ప్రతినిధులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు. సమావేశంలో కలెక్టర్‌ డాక్టర్‌ బీ గోపి, మేయర్‌ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, టూరిజం ఎస్‌ఈ సరిత, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ గంగాధర్‌, ఆర్డీవో కే మహేశ్వర్‌, ఐఎన్‌ఏ స్టూడియో ప్రతినిధులు హర్ష్‌ గోయల్‌, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.