అక్షరటుడే, ఇందూరు: Minister review | ఇందిరమ్మ ఇళ్ల indiramma illu ఎంపిక పారదర్శకంగా జరగాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు minister jupalli krishnarao అన్నారు. బుధవారం నిజామాబాద్క లెక్టరేట్‌లో ఆయా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హతలేని వారికి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వొద్దని, ఎవరి రికమండేషన్‌తో ఎంపిక జాబితా రూపొందించవద్దని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్‌కు gas cilendar సంబంధించి జిల్లాలో 1,40 వేల కనెక్షన్లు ఉంటే, కేవలం 20 వేల మందికి సబ్సిడీ రావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడో లోపం ఉందని, వెంటనే సవరించాలని ఆదేశించారు. ప్రజలు కల్యాణలక్ష్మికి kalyaana Lakshmi application దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో ఆర్డీవోకు చేరాలని, ఎక్కడా ఎలాంటి తప్పులకు తావు లేకుండా చూడాలన్నారు.
Minister review | ఖాళీ రేషన్ షాపులను భర్తీ చేయాలి
ఖాళీగా ఉన్న రేషన్ షాపులను ration shops భర్తీ చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే అన్ని రేషన్ షాపులకు సరి సమానంగా కార్డులను ఇవ్వాలని ఆదేశించారు. గతం కంటే రెట్టింపు కమీషన్ రేషన్ డీలర్లకు అందజేస్తున్నామని గుర్తు చేశారు. గతంలో ధరణికి సంబంధించి ఎన్నో లోపాలు ఉండేవని, ప్రస్తుతం భూభారతిలో సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
Minister review | మిల్లర్స్ ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్టులో పెట్టండి
రైతులను రైస్ మిల్లర్స్ rice millers nizamabad ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్టులో పెట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రాలు, ట్రాన్స్పోర్ట్, తాడిపత్రులు, సంచులు ఇతర సమస్యల పరిష్కారానికి జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే ఇతర శాఖల నుంచి ఉద్యోగులను డిప్యూటేషన్ తీసుకోవాలని సూచించారు.
Minister review | కల్తీకల్లు ఘటనలు పునరావృతం కావొద్దు
ఉమ్మడి జిల్లాలో కల్తీకల్లు kalthi kallu తాగి ప్రజలు అనారోగ్యం పాలవ్వడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎక్సైజ్ శాఖ excise department nizamabad అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలన్నారు, సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు nizamabad collector rajiv gandhi hanumanthu, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి bodhan mla sudarshan reddy, భూపతిరెడ్డి rural mla bhupathi reddy, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.