అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jupally | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) రానున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.
ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.20 కామారెడ్డికి చేరుకుంటారు. 10.30 గంటలకు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆర్మూర్‌కు చేరుకుంటారు. అక్కడ రేషన్ లబ్ధిదారు ఇంట్లో భోజనం చేస్తారు. అలాగే కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీముబారక్ చెక్కులను(Shadi Mubarak cheques) పంపిణీ చేశారు. తదనంతరం మినీ ట్యాంక్ బండ్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత భీమ్‌గల్‌లో పర్యటించి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.