అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ కేసు మాదిరిగానే కార్ల రేసు కేసులోను బయటపడేందుకు కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లారని మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే.. బీజేపీ ముఖ్య నేతలను కలిసేందుకే కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లారని ఆయన ఆరోపించారు. కార్లరేసు కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు 13 రోజుల క్రితం ఏసీబీ బృందం గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. గవర్నర్‌ నుంచి క్లియరెన్స్‌ వస్తుందని తెలిసే కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లారన్నారు. కేబినేట్‌ అంగీకారం లేకుండా, ఒప్పందం కాకముందు విదేశాలకు కేటీఆర్‌ రూ.55 కోట్లు ఎలా పంపారని ఆయన ప్రశ్నించారు.