అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వరంగల్‌ జిల్లాను రాష్ట్రానికి రెండో రాజధానిగా చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్‌లో భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మమూనూరు ఎయిర్‌పోర్ట్‌కు అవాంతరాలు తొలిగిపోయాయని, కేంద్రం అనుమతిస్తే వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్‌ వస్తుందన్నారు. భద్రకాళి జలశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామన్నారు. భద్రకాళి చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.