అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SC Classification | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ SC Classification అమలు చేస్తూ ప్రభుత్వం జీవో GO విడుదల చేసింది. ఆ జీవో కాపీని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి Uttam Kumar Reddy కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించారు.
2026లో జరిగే జనాభా లెక్కల Census ప్రకారం ఎస్సీలు ఎంత పెరిగితే రిజర్వేషన్లు Reservations కూడా అంత పెంచుతామని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం చరిత్రాత్మకమైందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదన్నారు. దేశంలో తొలిసారిగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేశామన్నారు.