Konda Surekha | కేబినెట్​ విస్తరణపై మంత్రి కీలక వ్యాఖ్యలు

Konda Surekha | కేబినెట్​ విస్తరణపై మంత్రి కీలక వ్యాఖ్యలు
Konda Surekha | కేబినెట్​ విస్తరణపై మంత్రి కీలక వ్యాఖ్యలు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Surekha | కేబినెట్​ విస్తరణపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం అసెంబ్లీ(Assembly) వద్ద మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ  (Cabinet) విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఆమె పేర్కొన్నారు. కాగా రేవంత్​రెడ్డి (Revanth reddy) సెల్ఫ్​ డ్రైవింగ్​ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తారో తమకు తెలుసని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ​ అన్న వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. సెల్ఫ్​ డ్రైవింగ్​ గురించి కేటీఆర్​కు​ తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. అందరి బాగోతాలు తమ వద్ద ఉన్నాయని కేటీఆర్​ అనడంపై స్పందిస్తూ.. ఫోన్ ట్యాప్ చేసి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని ఆరోపించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్​ జీతం ఎంతో తెలుసా..

Konda Surekha | యాదగిరిగుట్ట బోర్డు

టీటీడీ(TTD) తరహాలో యాదగిరి గుట్ట బోర్డు(Yadagiri Gutta Board) ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం మంత్రి శ్రీధర్​బాబు అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుందని, యాదగిరిగుట్ట బోర్డు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని మంత్రి వివరించారు.

Advertisement