అక్షరటుడే, నిజామాబాద్ సిటీ/ఆర్మూర్: Waqf Amendment Bill | వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు రంజాన్(ramadan) పండుగ రోజు నిరసన తెలిపారు.
నగరంలోని ఖిల్లా(khilla) ఈద్గా వద్ద సోమవారం రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేసిన అనంతరం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్(Taher bin Hamdan) ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ద్వారా ముస్లింల స్వేచ్ఛను హరిస్తోందని వారు నినదించారు. కార్యక్రమంలో మైనారిటీలు పాల్గొన్నారు.
Waqf Amendment Bill | ఆర్మూర్ నియోజకవర్గంలో నల్లరిబ్బన్లతో..

ఎర్గట్ల మండలంలోని నాగేంద్ర నగర్, గుమ్మిర్యాల్ గ్రామాల్లో ముస్లింలు వక్ఫ్ బిల్లుకు నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు 2024 పార్లమెంటులో ప్రవేశపెట్టడం ద్వారా ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.