అక్షరటుడే, వెబ్‌డెస్క్ : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు(Moosi Project) పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మూసీ ప్రాజెక్ట్‌పై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. లంగర్‌హౌజ్ సమీపంలోని బాపూ ఘాట్(Bapu Ghat) వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్(Gandhi Sarovar)తో పాటు మీర్ ఆలం(Mir Alam Tank) ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై చేపట్టే బ్రిడ్జి పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని ఆదేశించారు. అప్పటిలోగా మిగతా పనులు పూర్తి చేయాలని సూచించారు. మీర్ ఆలం ట్యాంక్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు.
CM Revanth | పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో..
వంతెనతో పాటు మీర్ ఆలం ట్యాంక్‌లో ఉన్న మూడు ఐలాండ్లను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్ ఏర్పాటు చేయాలన్నారు. బోటింగ్(Boting) సౌకర్యం కల్పించి, పర్యాటకులు ఉండేలా రిసార్ట్స్(Resorts), హోటల్స్(Hotels) అందుబాటులో ఉంచాలన్నారు. ట్యాంక్‌లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్(DPR) సిద్ధం చేయాలన్నారు. పీపీపీ(PPP) మోడల్లో ఈ ఐలాండ్ జోన్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.