అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | భక్తులు devotees ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో Tirumala devasthanam అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తారు. అలాంటి క్షేత్రంలో సిబ్బంది నిర్లక్ష్యం negligent కొట్టచ్చినట్లు కనిపిచింది.
కొందరు భక్తులు చెప్పులు వేసుకొని wearing sandals ఆలయంలోని వెళ్లడానికి ప్రయత్నించారు. అసలైతే ఆలయ మాఢవీధుల్లోకి పాదరక్షలు అనుమతి లేదు. కానీ కొందరు భక్తులు మాత్రం ఏకంగా ఆలయ మహాద్వారం వరకు చెప్పులతో రావడం కలకలం రేపింది. మహాద్వారం వద్ద భద్రత సిబ్బంది security staff గమనించి వారికి చెప్పడంతో అక్కడ పాదరక్షలు వదిలేసి ఆయలంలోని వెళ్లారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ Vaikunta Queue Complex నుంచి లోనికి వెళ్తారు. అక్కడ సిబ్బంది భక్తులను తనిఖీ చేసి ఫోన్లు, పాదరక్షలు, నిషేధిత వస్తువులు ఉంటే అనుమతించరు. అయితే ఈ రోజు మాత్రం పాదరక్షలతో కొందరు భక్తులు లోనికి వెళ్లడం గమనార్హం. అయితే వారు వీఐపీలు కావడంతోనే అనుమతించారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తిరుమలలో రోజుకు ఒక అపచారం.. వీఐపీలు అయితే పట్టించుకోరా?
పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అసలు పట్టించుకోరా?
తాజాగా శ్రీవారి ఆలయం ఎదుట వరకు చెప్పులతో వచ్చిన భక్తులు.
మాఢ వీధుల్లో కూడా చెప్పులకు అనుమతి లేనిది.. ఆలయ ద్వారం ఎదుట వరకూ ఎలా అనుమతిస్తారని మండిపడుతున్న భక్తులు.… pic.twitter.com/tV8f1SzabT
— greatandhra (@greatandhranews) April 12, 2025