Miss World | నేడు మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్​.. వేదిక ఎక్కడంటే..

Miss World | నేడు మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్​.. వేదిక ఎక్కడంటే..
Miss World | నేడు మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్​.. వేదిక ఎక్కడంటే..
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Miss World : భాగ్యనగరం వేదికగా నిర్వహించ తలపెట్టిన 72వ మిస్ వరల్డ్ (Miss World)పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై నేడు(మార్చి 20, గురువారం) తెలంగాణ ప్రభుత్వం ప్రీ ఈవెంట్​ నిర్వహిస్తోంది. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు హైదరాబాద్​ బేగంపేట్ లోని టూరిజం ఫ్లాజా హోటల్ లో మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండబోతోంది.

Miss World : ప్రపంచ సుందరి హాజరు..

72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ భారతదేశంలోని తెలంగాణలో మే 7 నుంచి 31 వరకు ఉంటుంది. ఇక నేటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ(Miss World Limited CEO Julia Morley), 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా(Miss World Kristina Pizkova) పాల్గొననున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  hyderabad | బేగంపేట్ టూరిజం ప్లాజాలో అందాల పోటీ.. సంద‌డి చేసిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా!
Miss World | నేడు మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్​.. వేదిక ఎక్కడంటే..
Miss World | నేడు మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్​.. వేదిక ఎక్కడంటే..

Miss World : తెలంగాణ వైపు.. ప్రపంచ దేశాల చూపు

అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ కావడంతో రాష్ట్ర సర్కారు మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ టూరిజం(tourism)..పారిశ్రామిక(industrial) రంగాల వైపు ప్రపంచ దేశాలను ఆకర్షించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

Miss World : యాదగిరి ఆలయంతో పర్యటన ప్రారంభం

తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ 2025 ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు మిస్ వరల్డ్ 2024 విజేత, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా ఇప్పటికే హైదరాబాద్​ చేరుకున్నారు. యాదగిరి గుట్ట ఆలయ(Yadagiri Gutta Temple) సందర్శనతో క్రిస్టినా తన తెలంగాణ పర్యటనను ప్రారంభించారు. అక్కడ ఆధ్యాత్మిక(spiritual) చింతనన, ప్రశాంతమైన అనుభూతి పొందినట్లు ఆమె పేర్కొన్నారు.

Advertisement