Advertisement
అక్షర టుడే, భీమ్‌గల్: Bheemgal | అంగన్వాడీల్లో లబ్ధిదారులకు పోషకాహారం అందించడంలో భాగంగా మిషన్ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ సంతోష్‌కుమార్ అన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో సుపోషిత్ జీపీ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడం ద్వారా సుపోషిత్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ జ్ఞానేశ్వరి, సూపర్‌వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.
Advertisement