SUPREME COURT : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు వాయిదా : స్పీకర్​కు నోటీసులు
SUPREME COURT : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు వాయిదా : స్పీకర్​కు నోటీసులు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ః SUPREME COURT : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచార‌ణ‌ను సుప్రీంకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్​ గడ్డం ప్రసాద్(SPEAKER GADDAM PRASAD)​, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలని సూచించింది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయాలని కోరుతూ కేటీఆర్‌, కౌశిక్‌ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్లు కోరారు.

SUPREME COURT : హైకోర్టు రిజిస్ట్రార్​తో సహా..

సుప్రీంకోర్టు తాజా అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం (TELANGANA GOVERNMENT), హైకోర్టు(HIGH COURT) రిజిస్ట్రార్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఎందుకు ఆలస్యం జరుగుతుందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై న్యాయమూర్తులు బీఆర్‌ గవాయి, అగస్టీన్‌ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.

SUPREME COURT : గతంలో స్పీకర్​పై సుప్రీం అసహనం..

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై గతంలోనూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పదినెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ‘వారిపై చర్యలు తీసుకునేందుకు మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత..? మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా..’ అని స్పీకర్‌నుద్దేశించి సూటిగా ప్రశ్నించింది. బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్‌, తెల్ల వెంట్రావ్‌లపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు.

Advertisement