MLA Dhanpal : రాష్ట్రంలో బీజేపీ హవా సాగుతోంది

MLA Dhanpal : రాష్ట్రంలో బీజేపీ హవా సాగుతోంది
MLA Dhanpal : రాష్ట్రంలో బీజేపీ హవా సాగుతోంది
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : MLA Dhanpal : రాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగుతోందని, ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శమమని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్​రెడ్డి కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | కేసీఆర్​ అసెంబ్లీలో చర్చకు రావాలి

 

బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ధన్​పాల్​ పేర్కొన్నారు. కిషన్​రెడ్డిపై ఇటీవల సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కిషన్​రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. బీజేపీ వరుస విజయాలే ఆయన పనితనానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు.

Advertisement