అక్షరటుడే, ఇందూరు: ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వినియోగదారుల రక్షణ చట్టంలో అనేక రకాల సంస్కరణలు తీసుకువచ్చారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. కన్జ్యూమర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారుల రక్షణ కోసం స్వచ్ఛందంగా సీసీఐ రెండు రోజులపాటు సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సీసీఐ జాతీయ అధ్యక్షురాలు ప్రీతి పాండే మాట్లాడుతూ.. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సంస్థ కన్స్యూమర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎస్కే రసూల్ బీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాసురాం, సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్, జాతీయ ప్రధాన కార్యదర్శి చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, వీఎన్ వర్మ, శ్రీనివాస్, రత్నాకర్, రామనాథం, దేవిష్, మహిళా విభాగ అధ్యక్షురాలు లక్ష్మి, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad MP | మాధవ​నగర్​లో పర్యటించిన ఎంపీ అర్వింద్​