యోగా పుట్టినిల్లు భారత్

0

అక్షరటుడే ఇందూరు: యోగా పుట్టింది భారతదేశంలోనేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. నగరంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. యోగా ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు అనేకమంది భారతీయ మహానుభావులు తెలియజేశారన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే గా జరుపుకుంటున్నామన్నారు. 177 దేశాలు ఐక్యరాజ్యసమితిలో అంగీకారం తెలిపాయని గుర్తు చేశారు. యోగాతో ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపే ఆస్కారం ఉందన్నారు. ఖేలో ఇండియా ద్వారా యోగాతో పాటు అనేక క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యోగాసోసియేషన్ అధ్యక్షుడు రామచందర్, కార్యదర్శి బాల శేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగీత, తెలంగాణ యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి నందన్ కృపాకర్, రామ్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.