Advertisement

అక్షరటుడే, ఇందూరు: కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఖేలో ఇండియా పేరుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖేలో భారత్ ఉత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు యువకులు మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మత్తు వదిలి మైదానంలోకి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, ఇందూర్ ప్రముఖ్ రేంజర్ల నరేష్, విభాగ్ ఆర్గనైజర్ సెక్రెటరీ రాజ్ సాగర్, విభాగ్ కన్వీనర్ శశి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Delimitation | డీలిమిటేషన్​ అంటే ఏమిటి.. ఆందోళనలు ఎందుకంటే..