అక్షరటుడే, ఇందూరు: కాలుష్య రహిత సమాజానికి మొక్కలు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం-పచ్చదనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. భవిష్యత్తులో పిల్లలు బాగుండాలన్నా.. కాలుష్య రహిత సమాజం నిర్మించాలన్న మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, సుధాకర్, ఎఫ్ ఆర్ వోలు సంజయ్, రాధిక, బీట్ ఆఫీసర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.