పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తా..

0

అక్షరటుడే, ఇందూరు: దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తన ట్రస్టు ద్వారా ఇప్పటికే మౌలిక వసతులు కల్పించానని, మిగిలిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గావ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం దుబ్బలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గ నిధులతో సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చిందని, కార్యకర్తలు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయం దళిత బస్తీని సందర్శించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షుడు రాజు, కార్పొరేటర్ ప్రవళిక, నాయకులు శ్రీధర్, రంజిత్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు