అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌ను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయమే హాస్టల్‌కు వెళ్లిన ఆయన హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. వంటగది, డైనింగ్ హాల్‌ను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. హాస్టల్లో వసతులపై విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని హాస్టల్ వార్డెన్‌కు సూచించారు.