అక్షరటుడే, భిక్కనూరు: ప్రభుత్వం గురుకులాల్లో అమలు చేస్తున్న నూతన డైట్ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సూచించారు. భిక్కనూరు మండలం జంగంపల్లి మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో శనివారం నిర్వహించిన నూతన డైట్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.