అక్షరటుడే, కామారెడ్డి: వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి సేవలందించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పట్టణంలోని 14వ వార్డులో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఆయుష్మాన్ పథకంలో భాగంగా కేంద్రం ఆయుష్ మందిరాలను ఏర్పాటు చేస్తోందన్నారు. వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం దేవునిపల్లి దత్తాత్రేయ ఆలయంలో దత్తజయంతిలో పాల్గొన్నారు.