అక్షరటుడే, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి పెద్ద చెరువులో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మంగళవారం చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, చేపల పెంపకం దారుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.