అక్షరటుడే, కామారెడ్డి టౌన్: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి సీతక్క రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రూ. 25కోట్లతో పనులకు ప్రతిపాదనలు పంపగా రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన పనులకు సైతం త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని మంత్రి హమీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.