అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో శనివారం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇదివరకే కలెక్టర్ ను కలిసి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని విన్నవించమాన్నారు. దోమకొండ మండలంలో బీజేపీ సభ్యత్వం నమోదు రికార్డు స్థాయిలో చేయించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి. నాయకులు పాల్గొన్నారు.