అక్షరటుడే, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో 40 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామని జాతీయ కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. రుణమాఫీ చేసినట్లు ఇచ్చిన ప్రకటనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రూపొందించిన చిత్రాన్ని వాడారని.. రైతుల లెక్క విషయంలో సీఎం అదే టెక్నిక్ వాడారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న 40 లక్షలు అనే సంఖ్యను సీఎం రేవంత్‌రెడ్డి (ఏఐ) అంటే ఎనుముల ఇంటెలిజెన్స్‌తో రూపొందించిదేనని ఎద్దేవా చేశారు.