అక్షర టుడే, జుక్కల్: గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు అంగన్‌వాడీల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. మంగళవారం మహమ్మద్ నగర్, బిచ్కుంద మండలకేంద్రాల్లో నిర్వహించిన పోషణ్ అభియాన్, పోషణ మాసోత్సవ కార్యక్రమాల్లో మాట్లాడారు. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఐసీడీఎస్ సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జయ ప్రదీప్, నాయకులు రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, ఆకాశ్, మనోజ్ కుమార్, ప్రజాపండరి, లక్ష్మారెడ్డి, గంగి రమేశ్, లోకియా నాయక్, సవాయిసింగ్, అంగన్ వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.