అక్షరటుడే, జుక్కల్: పాఠశాలలో విద్యార్థులు సోదర భావంతో మెలగాలని ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు సూచించారు. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన బాలల దినోత్సవానికి ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుందన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.