Nizamsagar | అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Nizamsagar | అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
Nizamsagar | అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
Advertisement

అక్షర టుడే, నిజాంసాగర్‌: Nizamsagar | మహమ్మద్‌ నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నర్వ, గున్కుల్, తునికిపల్లి, గాలిపూర్, తెల్గాపూర్‌ గ్రామాల్లో ఈజీఎస్‌ నిధులతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.

 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ ఛైర్మన్​ మనోజ్‌ కుమార్, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు ఆకాశ్​, నాయకులు రమేష్, నాగభూషణం గౌడ్, లోక్యానాయక్, సవాయ్‌ సింగ్, నర్సింలు, తోటరాజు సాయ గౌడ్, డాకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  MLC elections | నామినేషన్లకు రేపే చివరి రోజు.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని పార్టీలు